వరుసగా రెండోరోజు 60వేలు దాటిన కేసులు

వరుసగా రెండోరోజు 60వేలు దాటిన కేసులు
  •  20,88,611కి చేరిన కేసుల సంఖ్య
  • ఇప్పటి కోలుకున్న వారు 14.27లక్షల మంది

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో వరుసగా రెండో రోజు
60 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 61,537 కేసులు నమోదైనట్లు కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ బులిటెన్‌ రిలీజ్‌ చేసింది. దీంతో శనివారం ఉదయానికి మన దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 20,88,611కి చేరింది. ఇప్పటి వరకు 14.27లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 6,19,088
యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 933 మంది వ్యాధి బారిన పడి చనిపోయారు. ఈ మేరకు చనిపోయిన వారి సంఖ్య 42,518కి చేరింది. దేశంలో మరణాల
రేటు ప్రస్తుతం 2.04 శాతంగా ఉంది. 24 గంటల్లో మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు, ఉత్తర్‌‌ప్రదేశ్‌లోనే ఎక్కువ కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. మహారాష్ట్రలో 4.9 లక్షల కేసులు, తమిళనాడులో 2.85లక్షలు, ఏపీలో 2.06లక్షలు, కర్నాటక 1.64 లక్షలు, ఢిల్లీ 1.42, ఉత్తర్‌‌ప్రదేశ్‌ 1.13లక్షలు, పశ్చిమబెంగాల్‌ 89.66, తెలంగాణ 77,513, బీహార్‌‌లో 71,304 కేసులు, గుజరాత్‌లో 68000 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు 2.33 కోట్ల శాంపిల్స్‌ను టెస్ట్‌ చేశారు. శుక్రవారం ఒక్కరోజే 5,98,778 టెస్టులు చేశారు.