ఆర్నేళ్లలోనే కరోనాకు 624 మంది డాక్టర్లు బలి

ఆర్నేళ్లలోనే కరోనాకు 624 మంది డాక్టర్లు బలి
  • ఎక్కువగా ఢిల్లీలోనేనన్న ఐఎంఏ
  • గతేడాది 748 మంది డాక్టర్లు మృతి

కోవిడ్-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా సోకి ఇప్పటివరకు 624 మంది డాక్టర్లు మరణించారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రకటించింది. ఇందులో అత్యధికంగా 109 మరణాలు ఢిల్లీలోనే సంభవించాయని పేర్కొంది. కరోనా మొదటి వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా 748 మంది డాక్టర్లు మరణించిన విషయం తెలిసిందే.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకారం.. జూన్ 2 వరకు దేశంలో 624 మంది డాక్టర్లు చనిపోయారు. ఢిల్లీ తర్వాత అత్యధికంగా బీహార్‌లో 96, ఉత్తరప్రదేశ్‌లో 79, రాజస్తాన్‌లో 43, జార్ఖండ్‌లో 39, ఆంధ్రప్రదేశ్‌లో 34, తెలంగాణలో 32, గుజరాత్‌లో 31, పశ్చిమ బెంగాల్‌లో 30 మంది డాక్టర్లు మరణించారు. గతేడాది కరోనాతో 748 మంది డాక్టర్లు మరణించగా.. ఈ ఏడాది మొదటి అర్థవార్షికంలోనే 624 మంది చనిపోవడం గమనార్హం అని ఓ డాక్టర్ పేర్కొన్నారు.