2025 లో 6 ,385 స్టార్టప్‌‌లు క్లోజ్‌‌.. గుర్తింపు పొందిన మొత్తం స్టార్టప్‌‌లు లక్షా 97 వేల పైనే..

2025 లో 6 ,385 స్టార్టప్‌‌లు క్లోజ్‌‌.. గుర్తింపు పొందిన మొత్తం స్టార్టప్‌‌లు లక్షా 97 వేల పైనే..

న్యూఢిల్లీ: 2025  అక్టోబర్ 31 నాటికి  6,385 గుర్తింపు పొందిన స్టార్టప్‌‌లు మూతపడ్డాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటివరకు  మొత్తం1,97,692 సంస్థలు స్టార్టప్‌‌లుగా గుర్తింపు పొందాయని తెలిపింది.  మహారాష్ట్రలో అత్యధికంగా 1,200 స్టార్టప్‌‌లు మూతపడ్డాయి. తరువాత కర్నాటక (845), ఢిల్లీ (737), ఉత్తరప్రదేశ్ (598), తెలంగాణ (368), తమిళనాడు (338) ఉన్నాయి. 

 బిజినెస్‌ మోడల్ స్థిరంగా లేకపోవడం, మార్కెట్ డిమాండ్, ఆర్థిక పరిస్థితులు, ఫండింగ్ పొందడంలో ఇబ్బందులు వంటి అంశాల కారణంగా స్టార్టప్‌‌లు మూతపడ్డాయని  వాణిజ్య, పరిశ్రమల సహాయ మంత్రి జితిన్ ప్రసాదా లోక్‌‌సభలో తెలిపారు.  స్టార్టప్ ఇండియా పథకం కింద ఫండ్స్ ఆఫ్ ఫండ్స్‌‌, సీడ్ ఫండ్ స్కీమ్‌‌, క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌‌  అమలులో ఉన్నాయి. 

ఆదాయపు పన్ను చట్టం 80-ఐఏసీ ప్రకారం, గుర్తింపు పొందిన స్టార్టప్‌‌లు మూడు సంవత్సరాల పాటు లాభాలపై 100శాతం మినహాయింపు పొందొచ్చు. 4,147 స్టార్టప్‌‌లు ఈ సర్టిఫికెబట్ పొందాయి. స్టార్టప్‌‌లు ఇప్పటివరకు 21.11 లక్షల డైరెక్ట్ జాబ్స్‌ సృష్టించాయి.