14800 మంది తీసుకొచ్చేందకు.. 64 ఫ్లైట్లు

14800 మంది తీసుకొచ్చేందకు.. 64 ఫ్లైట్లు
 • ఏర్పాట్లు చేస్తున్న కేంద్రం
 • విదేశాల్లోని మనవాళ్లను తీసుకొచ్చేందకు ప్లాన్‌ రెడీ

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి కారణంగా ట్రావెల్‌ బ్యాన్‌ విధించడంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇరుక్కుపోయిన మనవాళ్లను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తలు మొదలు పెట్టింది. యూఎస్‌, కువైట్‌, ఫిలిప్పైన్స్‌, బంగ్లాదేశ్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, సౌదీ అరేబియా, మలేషియా, యూఏఈల్లో ఇరుక్కుపోయిన 14800 మందిని తీసుకొచ్చేందుకు 64 స్పెషల్‌ ఫ్లైట్లు ఏర్పాటు చేశారని అధికారులు చెప్పారు. సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించేందుకు వీలుగా ఒక్కో ఫ్లైట్‌లో 200 – 300 ప్యాసింజర్లను అనుమతిస్తారు. ఈ నెల 7 నుంచి 12 మధ్య ఈ ఫ్లైట్లను నడుపుతామని అధికారులు చెప్పారు. మనవాళ్లను తీసుకొచ్చేందుకు ఎయిర్‌‌ఇండియా, ఎయిర్‌‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌ ఫ్లైట్లు నడుపుతున్నట్ల చెప్పారు. మాల్దీవులు, యూఏఈలో ఉన్న వాళ్లు తీసుకొచ్చేందకు నేవీ ఇప్పటికే షిప్పులను పంపింది. ఐఎన్‌ఎస్‌ జైశ్వాల్‌ 1000 మంది ఇండియన్స్‌ను తీసుకురానుంది. ఐఎన్‌ఎస్‌ శార్దూల్‌, ఐఎన్‌ మాగర్‌‌ ఒక ట్రిప్పులో 300 మంది ప్యాసింజర్లను తీసుకురానుంది. దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ విధించిన ప్రభుత్వం దాన్ని ఈ నెల 17 వరకు పొడిగించింది.

ప్లాన్‌ ఏంటి?

 •  ఇక్కడి నుంచి యూఎస్‌, ఫిలిప్పైన్స్‌, సింగపూర్‌‌, బంగ్లాదేశ్‌, యూఏఈ, యూకే, సౌదీ అరేబియా, ఖతార్‌‌, సింగపూర్‌‌, ఒమన్‌, బహ్రయిన్‌, కువైట్‌కు స్పెషల్స్‌ ఫ్లైట్స్‌ వెళ్లనున్నాయి.
 • మొదటి రోజు 10 ఫ్లైట్లలో 2300 మందిని తీసుకొస్తారు.
 • రెండో రోజు 9 కంట్రీస్‌ నుంచి 2050 మంది చెన్నై, కొచ్చి, ముంబై, అహ్మదాబాద్‌, బెంగళూరు, ఢిల్లీకి చేరుకుంటారు.
 • మూడో రోజు 13 దేశాల నుంచి ముంబై, కొచ్చి, లక్నో, ఢిల్లీకి మరికొంత మంది చేరుకోనున్నారు.
 • నాలుగో రోజు యూకే, యూఎస్‌, యూఏఈల్లో ఉన్న 1850 మందిని తీసుకొస్తారు.
 • సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించే విధంగా ఒక్కో ఫ్లైట్‌లో కేవలం 200 – 300 మందిని మాత్రమే అనుమతిస్తారు.
 • ఫ్లైట్‌ ఎక్కే ముందు ప్యాసింజర్లు కచ్చితంగా ఫీవర్‌‌, దగ్గు, షుగర్‌‌, శ్వాస సంబంధిత వ్యాధులు ఏమైనా ఉంటే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
 •  కరోనా లక్షణాలు లేని ప్యాసింజర్లను మాత్రమే అనుమతిస్తారు.
 •  ఫ్లైట్లలో వచ్చేవారు కచ్చితంగా ‘ఆరోగ్య సేతు’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
 •  ప్రతి ఒక్కరికి మెడికల్‌ స్ర్కీనింగ్‌ నిర్వహిస్తారు.
 • ప్రతి ఒక్కరు 14 రోజుల పాటు హాస్పిటల్‌లో లేదా ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో ఉండాలి.
 • 14 రోజుల తర్వాత టెస్టులు నిర్వహించి హెల్త్‌ ప్రొటోకాల్‌ ప్రకారం చర్యలు తీసుకుంటారు.
 • ఫ్లైట్లలో ప్రయాణించే వారు ఎవరి ఖర్చులు వారే భరించాలి.