
భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గురువారం భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ జిల్లాలో 25 మంది, నారాయణ్‌పూర్ జిల్లాలో 8 మంది, సుక్మా జిల్లాలో ఐదుగురు, దంతెవాడ జిల్లాలో 15 మంది, కాంకేర్‌లో 13 మంది మావోయిస్టులు ఆయా జిల్లాల పోలీస్ ఆఫీసర్ల ఎదుట లొంగిపోయారు.
మొత్తం 66 మంది లొంగిపోగా.. వారిపై రూ.2.27 కోట్ల రివార్డు ఉన్నట్లు ఆఫీసర్లు తెలిపారు. బీజాపూర్ జిలాల్లో లొంగిపోయిన స్పెషల్ జోనల్‌కమిటీ సభ్యుడు రామన్న ఇర్పా అలియాస్ జగదీశ్ అలియాస్ వికేశ్ ఒక్కడిపైనే రూ.25 లక్షల రివార్డు ఉందని చెప్పారు.