నిజామాబాద్ జిల్లాలో 670 వడ్ల కొనుగోలు సెంటర్లు : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

నిజామాబాద్ జిల్లాలో 670 వడ్ల కొనుగోలు సెంటర్లు : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

వర్ని, వెలుగు : వానాకాలం సీజన్​కు సంబంధించి జిల్లావ్యాప్తంగా 670 వడ్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభించనున్నట్లు కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం వర్ని, చందూరు, మోస్రా మండలాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు.  జిల్లాలో ఇప్పటివరకు 300 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం సేకరించారు.. ఎన్ని లారీలు ఉన్నాయి.. ఎన్ని లోడ్​లు మిల్లులకు పంపించారు.. అంటూ నిర్వాహకులను ఆరా తీశారు. 

ధాన్యం కొనుగోలుకు సంబంధించి పూర్తి వివరాలను రిజిస్ట్రర్​లో నమోదు చేయాలని సూచించారు.  రైతుల నుంచి ధాన్యం సేకరించగానే రశీదులు ఇవ్వాలని,  ట్రక్​ షీట్లు వచ్చిన వెంటనే ట్యాబ్​లో ఎంట్రీ చేస్తేనే సకాలంలో బిల్లులు అందుతాయన్నారు. గన్నీ బ్యాగులు, గ్రెయిన్​ క్యాలీపర్లు, మాయిచ్చర్ మీటర్లు, తూకం యంత్రాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. లోడింగ్,అన్​లోడింగ్​లో జాప్యం జరగొద్దన్నారు. 

మొక్కజొన్న సాగైన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్​ తెలిపారు. కలెక్టర్​ వెంట అడిషనల్​కలెక్టర్​ కిరణ్​కుమార్, సివిల్​సప్లై డీఎం శ్రీకాంత్​రెడ్డి, సహకార శాఖ అధికారి అంబర్​సింగ్, వర్ని ఏఎంసీ చైర్మన్​ సురేశ్​బాబా, చందూరు మాజీ జడ్​పీటీసీ అంబర్​సింగ్, తహసీల్దార్​ సాయిలు పాల్గొన్నారు