బంగ్లాదేశ్‌‌లో 7 రోజులు లాక్‌‌డౌన్‌‌

బంగ్లాదేశ్‌‌లో 7 రోజులు లాక్‌‌డౌన్‌‌

ఢాకా: కరోనా వ్యాప్తిని కంట్రోల్​ చేయడానికి బంగ్లాదేశ్ ​ప్రభుత్వం దేశవ్యాప్త లాక్​డౌన్​ ప్రకటించింది. సోమవారం నుంచి 7 రోజులు అమలు చేయనున్నట్లు తెలిపింది. నిత్యావసరాలు, ఎమర్జెన్సీ సర్వీసు లకు ఎటువంటి ఆటంకం ఉండదని మంత్రులు చెప్పారు. లాక్‌‌డౌన్ టైమ్​లో అన్ని ఆఫీసులు, కోర్టులు మూసేయాలని స్పష్టంచేశారు. ఫ్యాక్టరీలు, మిల్లులు మాత్రం తెరిచే ఉంటాయని చెప్పారు.  సేఫ్టీ రూల్స్ పాటిస్తూ షిఫ్ట్‌‌ల ప్రకారం కార్మికులు పని చేసుకోవచ్చంది. కాగా, ప్రాన్స్​లో శనివారం నుంచి మళ్లీ లాక్​డౌన్ అమలుచేస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. బెల్జియం, పోలాండ్ దేశాల్లోనూ కరోనా రూల్స్ మరింత కఠినం చేశారు. పోలాండ్ లో శనివారం నుంచి మూడు వారాల పాటు దేశవ్యాప్త లాక్​డౌన్ విధించారు. జర్మనీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.