ఫైర్ క్రాకర్స్ తయారుచేస్తుండగా పేలుడు

ఫైర్ క్రాకర్స్ తయారుచేస్తుండగా పేలుడు

బిహార్‎లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పదిమంది చనిపోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. భగల్ పూర్ జిల్లా తతార్ పూర్‎లోని ఓ మూడంతస్తుల ఇంట్లో క్రాకర్స్ తయారుచేస్తుండగా గురువారం రాత్రి ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. సమాచారమందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భగల్ పూర్ కలెక్టర్ సుబ్రత్ కుమార్ సేన్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారిని మయాగంజ్‎లోని జెఎల్ఎన్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

For More News..

ఉక్రెయిన్‌లో భారత విద్యార్థికి బుల్లెట్ గాయాలు