ఇంజిన్ కవర్ లేకుండానే ఎగిరిన విమానం

ఇంజిన్ కవర్ లేకుండానే ఎగిరిన విమానం

విమానం గాల్లో ఎగరడం మనం చూసాం. కానీ ఓ ఫ్లైట్ ఇంజిన్ కవర్  లేకుండానే ఆకాశాంలో ఎగిరింది. ఈ ఘటన ఎక్కడో వేరే దేశంలోజరగలేదు. మన భారత్‌లోనే జరిగింది. ముంబై నుంచి భుజ్ వెళ్లిన అలియన్స్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం.. ఇంజిన్ కవర్ లేకుండానే ప్రయాణించింది. రన్‌వేపై ఇంజిన్ కవర్ కూలిన ఆ విమానంలో 70 మంది ప్రయాణించారు. దీంతో ఈ ఘటనపై పౌర విమానయాన శాఖ స్పందించింది. దర్యాప్తునకు ఆదేశించింది. 

వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ ఉదయం అలియన్స్ ఎయిర్ ఏటీఆర్ 72-600 విమానం ముంబై నుంచి గుజరాత్‌లోని భుజ్‌కు బయలుదేరి వెళ్లింది. అయితే ఆ విమానం మాత్రం సురక్షితంగానే ల్యాండ్ అయ్యింది. కానీ టేకాఫ్ సమయంలో ఆ విమాన ఇంజిన్ కవర్ ఊడిపోయింది. టేకాఫ్‌ను మానిటర్ చేసిన ఏటీసీ వార్నింగ్ సిగ్నల్ ఇచ్చింది. ఆ కవర్‌ను రన్‌వేపై గుర్తించారు. 70 మంది విమానంలో నలుగురు సిబ్బంది, ఓ మెంటేనెన్స్ ఇంజినీర్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

సమతామూర్తి విగ్రహంపై రాహుల్ ట్వీట్

ఏ బట్టలు ధరించాలనేది ఆడవాళ్ల ఇష్టం