
హైదరాబాద్ : ముచ్చింతల్లో ఏర్పాటు చేసిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. రామానుజాచార్యుల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి సంబంధించి ట్విట్టర్లో ఆసక్తికర ట్వీట్ చేశారు. విగ్రహాన్ని చైనాలో తయారుచేయడాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని చైనాలో తయారు చేశారు.. నవ భారత్ ఇండియా చైనాపై నిర్భరమేనా అంటూ ప్రధానికి చురకలంటించారు.
ముచ్చింతల్ లోని శ్రీరామ నగరంలో ఏర్పాటుచేసిన రామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని గత శనివారం ప్రధాని నరేంద్రమోడీ జాతికి అంకితం చేశారు. ఈ విగ్రహాన్ని చైనాకు చెందిన ఏరోసన్ కార్పొరేషన్ కంపెనీ తయారుచేసింది. ఈ పంచలోహ విగ్రహంలో 83శాతం రాగి వినియోగించగా.. వెండి, బంగారం, జింక్, టైటానియం లోహాలను ఉపయోగించారు. 1600 విడిభాగాలుగా భారత్కు తీసుకొచ్చిన ఈ విగ్రహాన్ని 15 నెలల పాటు శ్రమించి అతికించారు.
Statue of Equality is Made in China.
— Rahul Gandhi (@RahulGandhi) February 9, 2022
‘New India’ is China-nirbhar?