దేశంలో నలుగురు నియంతృత్వ నేతల పాలన

 దేశంలో నలుగురు నియంతృత్వ నేతల పాలన
  • కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : 70 ఏళ్ల దేశ అభివృద్ధిని 8 ఏళ్ల పాలనలో బీజేపీ నాశనం చేసిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో కేవలం నలుగురు నియంతృత్వ నేతల పాలన నడుస్తోందని ఆరోపించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై పార్లమెంటులో చర్చ జరపట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారన్ని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని, కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.  

స్టార్టప్ ఇండియా ఎక్కడుంది..? అని రాహుల్ గాంధీ  ప్రశ్నించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగినా.. ధరలు పెరుగుతున్నా.. కేంద్ర ఆర్ధిక మంత్రి అంగీకరించడం లేదని పేర్కొన్నారు. ‘‘ఆర్ధిక మంత్రికి దేశ ఆర్ధిక వ్యవస్థలో ఏం జరుగుతుందో..? తెలుసా..? తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని అనుకోవాల్సి వస్తోంది.. అయితే ఎలాంటి అవగాహన లేదని మాత్రం అనుకోవట్లేదు.. ఆమె కేవలం ఒక మౌత్ పీస్..’’అని రాహుల్ గాంధీ విమర్శించారు. అరెస్టులకు,కేసులకు.. బెదిరింపులకు తాను భయపడేది లేదని..భయపెట్టే వారే ఎక్కువ భయపడతారని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ నేతలే ఎక్కువ అబద్దాలు చెబుతున్నారని..అందుకే వారే భయపడుతున్నారని రాహుల్ గాంధీ  విమర్శించారు.