
75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ నాయకులను, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన పోరాట యోధులు, అమరవీరులను గుర్తు చేసుకుంటూ.. ప్రెస్ క్లబ్ హైదరాబాద్ లో 75వ గణ తంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనవరి 26వ తేదీ శుక్రవారం ప్రెస్ క్లబ్ అధ్యక్షలు ఎల్ వేణుగోపాల నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్ర పటాలకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దేశం కోసం వారు చేసిన సేవలను కొనియాడారు. జర్నలిస్టులందరూ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. జర్నలిస్టులు కలిసి ఉండాలని.. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని.. జర్నలిస్టులు ప్రజల తరుఫున ప్రభుత్వాలను ప్రశ్నించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ప్రధానకార్యదర్శి ఆర్. రవికాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు సి వనజ, సంయుక్త కార్యదర్శులు చిలుకూరి హరి ప్రసాద్, రమేష్ వైట్ల, కార్యవర్గ సభ్యులు బాపు రావు, మర్యాద రమాదేవి, టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.