సిద్దిపేట జిల్లాలోని పంచాయతీ పోరులో 75 సంవత్సరాల వృద్ధుడు

సిద్దిపేట జిల్లాలోని పంచాయతీ పోరులో 75 సంవత్సరాల వృద్ధుడు

సిద్దిపేట, వెలుగు: జిల్లాలోని నంగునూరు  గ్రామ పంచాయతీ ఎస్సీలకు రిజర్వ్ అయింది.  అదే  గ్రామానికి చెందిన దేవులపల్లి చంద్రయ్య అనే వృద్ధుడు (77)  సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాడు. తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి పాటుపడతానని ప్రచారం చేస్తున్నాడు. 

సింగీతం సర్పంచ్ బరిలో అంగన్వాడీ టీచర్

రాయికోడ్: మండలంలోని సింగీతం పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వేషన్ అయింది.  నలుగురు ఎస్సీ మహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో ఒకరు శనివారం విత్‌డ్రా అయ్యారు. గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా పనిచేసే భారతమ్మ తన ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్​పదవికి పోటీ చేస్తున్నారు. తనను గెలిపిస్తే పారదర్శక పాలన అందిస్తానని, చిన్నారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తానని చెబుతున్నారు.