మరోసారి హార్ట్ను టచ్ చేయనున్న అనిత.. గెట్ రెడీ బాయ్స్

మరోసారి హార్ట్ను టచ్ చేయనున్న అనిత.. గెట్ రెడీ బాయ్స్

7/జీ బృందావన కాలని (7G Brindavan Colony)తో ఆడియాన్స్కు దగ్గరయ్యాడు హీరో రవికృష్ణ (Ravi Krishna). సోనియా అగర్వాల్‌ హీరోయిన్గా నటించిన ఈ మూవీ అప్పట్లో యూత్ని తెగ ఆకట్టుకుంది. లవ్, కామెడీ, సాంగ్స్, ఎమోషన్స్ సీన్స్తో హార్ట్కు టచ్ అయ్యేలా చేశాడు డైరెక్టర్ సెల్వ రాఘవన్‌. సుమారు 19 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీరిలీజ్‌కు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్‌ 22న 4కే వెర్షన్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మూవీ టీం అప్పటి మోమేరీస్ షేర్ చేసుకుంది. 

ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం కొడుకు..హీరో రవికృష్ణ మాట్లాడుతూ..2004లో విడుదలైన 7/G బృందావన కాలనీ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయింది. లవ్ స్టోరీ, కామెడీ జానర్ లో వచ్చిన ఈ చిత్రం,  
స్టోరీ, సాంగ్స్తో  ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇక రీ రిలీజ్‌ ట్రైలర్‌ చూస్తుంటే ఆనాటి రోజులు గుర్తుకు వచ్చాయి. అందుకే కన్నీళ్లు వస్తున్నాయి. సినిమాలోని హీరో పాత్రకు నేను ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యా. ఇప్పటి వరకూ ఈ మూవీని ఒక్కసారి కూడా కంప్లీట్గా చూడలేదు . ఎందుకంటే, క్లైమాక్స్‌ చూసి తట్టుకోలేను. ఒకవేళ సినిమా చూస్తే నేను ఆ పాత్రలోకి వెళ్లిపోతా. షూటింగ్‌ చేస్తున్నప్పుడు కూడా.. ఓ రోజు ఇంట్లో నిరాశగా ఏదో ఆలోచిస్తూ కూర్చొన్నా. అప్పుడు..మా అమ్మ నన్ను అలా చూసి  షాకయ్యారు. ఇక, ఇప్పుడు ఇదే చిత్రానికి కంటిన్యూగా పార్ట్‌ 2 తీస్తున్నాం. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ కథ ఉండనుంది. ఈ మూవీలో డిఫరెంట్ లుక్లో కనిపించబోతున్న..అని పేర్కోన్నారు రవికృష్ణ.

ప్రొడ్యూసర్ ఏఎం రత్నం మాట్లాడుతూ.. 7జీ బృందావన కాలని ని తెరకెక్కించిన  డైరెక్టర్ సెల్వరాఘవన్‌ సీక్వెల్‌ను రూపొందించనున్నారు. ఇక ఇప్పటికే స్క్రిప్ట్‌ రెడీ అయ్యింది. అయితే, ఈ సినిమాకి రవికృష్ణనే మళ్లీ హీరోగా నటిస్తారని..సీక్వెల్‌లో మాత్రం అనస్వర రాజన్ (Anaswara Rajan) హీరోయిన్‌గా కనిపించనుందని..ఏఎం రత్నం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ గురించి సెల్వరాఘవన్‌తో కూడా చర్చలు జరుపినట్లు తెలిపారు. వచ్చే నెల(అక్టోబర్) నుంచి పార్ట్‌ 2 పనులు మొదలు కానున్నాయి.

ఈ సినిమా విడుదలైన నాటికి ఈ పేర్లు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా, వీళ్ల నటనతో అందరినీ మెప్పించి సినిమా థియేటర్లకు రప్పించారు. అయితే, ఈ సినిమా మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది. దీంతో ఆడియాన్స్ క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు. ఇక మరోసారి రాబోతున్నఈ మూవీ సీక్వెల్ ఎలాంటి అనుభూతిని పంచుతుందో చూడాలి మరి.