కొత్త గేమింగ్​ యాప్​​ లాంచ్ చేసిన గేమర్​షార్ట్స్​

కొత్త గేమింగ్​ యాప్​​ లాంచ్ చేసిన గేమర్​షార్ట్స్​

హైదరాబాద్​, వెలుగు : లోకల్​ గేమింగ్​ కంపెనీ 7 సీస్​ ఎంటర్‌‌టైన్‌​మెంట్​ లిమిటెడ్​ తన కొత్త గేమింగ్​ యాప్​​ గేమర్​షార్ట్స్​ను లాంఛ్​ చేసింది. ఈ తరహా గేమింగ్​ యాప్​ను తామే తొలిసారిగా మార్కెట్లోకి తెచ్చినట్లు కంపెనీ మేనేజింగ్​ డైరెక్టర్​ మారుతి శంకర్​ లింగమనేని చెప్పారు. న్యూస్, ఎనలిస్ట్​ పర్​స్పెక్టివ్స్​తోపాటు, ఇన్వెస్ట్​మెంట్స్​, ఇనొవేషన్స్​తో కూడిన గేమ్​షార్ట్స్​ కొత్త తరహా మొబైల్​ అప్లికేషన్​ అవుతుందని పేర్కొన్నారు. ఈ గేమింగ్​ యాప్​లో 25 సింపుల్​ గేమ్స్​ ఉంటాయని, గుగుల్​ ప్లే స్టోర్​లో ఇప్పటికే యాప్​ అందుబాటులో ఉందని వెల్లడించారు. గ్లోబల్​గా గేమింగ్​ మార్కెట్​ 340 బిలియన్​ డాలర్లవైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో ఈ కొత్త గేమింగ్​ యాప్​తో తాము కూడా ముందడుగు కోసం ఫోకస్​ పెడుతున్నట్లు మారుతి శంకర్​ చెప్పారు. 2022–27 మధ్య కాలంలో గేమింగ్​ ఇండస్ట్రీ ఈ గ్రోత్​ సాధిస్తుందని ఎనలిస్టు రిపోర్టులు చెబుతున్నాయని పేర్కొన్నారు.

25 సింపుల్​ గేమ్స్​..

రేసింగ్​, పజిల్స్​, ఆర్కేడ్​ స్పోర్ట్స్​ ...ఇలా ఎవరికి ఇష్టమైనవి వారు ఆడుకునేలా 25 సింపుల్​ గేమ్స్​ గేమర్​​షార్ట్స్​లో భాగమని మారుతి శంకర్​ చెప్పారు. క్విక్‌గా, కాజువల్​గా ఆడుకునే ఈ గేమ్స్​ను యూజర్లు ఎంజాయ్​ చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. గేమర్​​షార్ట్స్​ను త్వరలో యాపిల్​ యూజర్లకూ అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. మొబైల్​ గేమ్​ డౌన్​లోడ్స్​లో 80 % కాజువల్​ గేమ్స్‌ ఉంటుండగా, 35% ఇన్​–యాప్​ కొనుగోళ్లు ఉంటున్నాయి.