
హైదరాబాద్, వెలుగు: భారీ డిమాండ్కారణంగా 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ తన సైట్ www.onlinerealgames.comలో వరల్డ్ క్రికెట్ ఛాంపియన్స్ లీగ్, హార్స్ వరల్డ్ రైడ్, కేక్ మ్యాచ్, పజిల్ సార్ట్ గేమ్ అనే గేమ్‌లను తిరిగి ప్రారంభించింది. వీటిని ఉచితంగా ఆడుకోవచ్చని తెలిపింది. ప్లే స్టోర్, యాప్ స్టోర్, ఇండస్ యాప్‌స్టోర్‌తో సహా ప్రముఖ మొబైల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహించే టోర్నమెంట్లు, క్విక్ మ్యాచ్‌లు, లీగ్‌లు వీటిలో ఉంటాయి.
ఫ్రీ -టు -ప్లే క్యాజువల్ గేమింగ్ వెబ్‌సైట్ www.onlinerealgames.com తిరిగి ప్రారంభించామని 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్. ఎం శంకర్. అన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి దాని గేమ్ లైబ్రరీని రెట్టింపు చేస్తామని వెల్లడించారు.