
గ్రేట్ స్కాట్లాండ్ యార్డ్.. లండన్ లో ఉందది. 1829–1890 మధ్య కాలంలో అది మెట్రోపాలిటన్ పోలీస్ హెడ్క్ వార్టర్స్గా ఉండేది. ఇప్పుడది ఫైవ్‌స్టార్ హోటల్ అయిపోయింది. యూసుఫ్అలీ అనే కేరళకు చెందిన బిజినెస్ టైకూన్ , కోటీశ్వరుడు దానిని హోటల్ గా మార్చారు. దుబాయ్‌లోని ఆయన కంపెనీ లూలూ గ్రూప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్.. ₹584.88 కోట్లు ఖర్చు చేసి ఆపోలీస్ భవనానికి ఆధునిక హంగులు అద్దింది. ఈ హోటల్ లో 153 గదులున్నాయి. అందులోదిగే అతిథులకు మంచి వ్యూ ఉండేలా సూట్లను తీర్చిదిద్దారు. కోటలోని ఆనాటి రాజసం పోకుండా దానిని ఆధునీకరించారు. గదుల్లోని షాండ్లి యర్లలోనూ ఆ కోట చరిత్రను చూపేలా డిజైన్ చేశారు. మొత్తం గ్లాస్ తోనే తయారు చేసిన ఓ షాండ్లియర్ లో 19వ శతాబ్దంలోని మహిళా దొంగల ముఠా, 40 ఏనుగులుండేట్టు డిజైన్ చేశారు. పోలీసు సెల్ లను వర్క్‌స్పేస్ , మీటింగ్ రూంలుగా మార్చారు. గెస్టుల కోసం టీ పార్లర్, సీక్రెట్ విస్కీ బార్ , బాల్ రూం, మాంచి రెస్టారెంట్లను కట్టారు. ఈ హోటల్ ను ఈ ఏడాదే ప్రారంభించబోతున్నారు. హయత్ గ్రూప్ హోటల్స్ వాటిని నిర్వహించ నుంది. మరి, అలాంటి హోటల్ లో ఉండాలనుకుంటున్నారా? ఒక్కక్షణం.. ఒక్క రాత్రికి ₹8 లక్షలు కట్టాల్సిందే. కరెక్ట్‌గా చెప్పా లంటే ₹7,79,842 చెల్లించాలి.