8 మంది మావోయిస్టు ల అరెస్ట్‌‌‌‌‌‌‌‌...చత్తీస్‌‌‌‌‌‌‌‌ గఢ్‌‌‌‌‌‌‌‌, మహారాష్ట్ర బార్డర్‌‌‌‌‌‌‌‌ గడ్చిరోలి లో పట్టుకున్న బలగాలు

8 మంది మావోయిస్టు ల అరెస్ట్‌‌‌‌‌‌‌‌...చత్తీస్‌‌‌‌‌‌‌‌ గఢ్‌‌‌‌‌‌‌‌, మహారాష్ట్ర బార్డర్‌‌‌‌‌‌‌‌ గడ్చిరోలి లో పట్టుకున్న బలగాలు
  •     ఆయుధాలు, రూ.63.34 లక్షలు స్వాధీనం

భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌ పార్టీకి చెందిన ఎనిమిది మందిని ఆదివారం భద్రతాబలగాలు అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశాయి. గడ్చిరోలి ఎస్పీ రమేశ్‌‌‌‌‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌, మహారాష్ట్ర బార్డర్‌‌‌‌‌‌‌‌లో మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం అందడంతో ‘ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ అంతిమ్‌‌‌‌‌‌‌‌ ప్రహార్‌‌‌‌‌‌‌‌’ పేరిట సీ-60 కమాండోలు, సీఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌ జవాన్లు కూంబింగ్‌‌‌‌‌‌‌‌ మొదలు పెట్టారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. 

వీరందరిపై రూ.38 లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. పట్టుబడిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో... సుమారు 42 తుపాకులు, రెండు మందుపాతరలు, రూ.63.34లక్షలతో పాటు తూటాలు, కిట్‌‌‌‌‌‌‌‌బ్యాగులు, నిత్యావసర సరుకులు ఉన్న డంప్‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన మావోయిస్టులు గడ్చిరోలి, చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ దండకారణ్యంలో పనిచేస్తున్నట్లు తెలిపారు. వీరంతా అనేక హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నారని, వీరిపై అనేక కేసులు ఉన్నాయని వివరించారు.