రోజుల పసికందు కడుపులో 8 పిండాలు

రోజుల పసికందు కడుపులో 8 పిండాలు

ఆపరేషన్ చేసి తొలగించిన డాక్టర్లు 

రాంచీ: రోజుల పసికందు కడుపులో ఎనిమిది పిండాలను గుర్తించిన డాక్టర్లు.. ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. జార్ఖండ్​లోని రామ్​గఢ్ జిల్లాకు చెందిన ఓ గర్భిణికి పోయిన నెల 10న పాప పుట్టింది. పాప కడుపులో గడ్డ ఉందని గుర్తించిన డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ నెల 1న రాంచీలోని ప్రైవేట్ హాస్పిటల్​లో పాపకు సర్జరీ జరిగింది.

‘‘మేం పాప కడుపులో గడ్డ లాంటిది ఉందని గుర్తించి తొలగించేందుకు ఆపరేషన్ చేశాం. అయితే అవి పిండాలు. మొత్తం 8 పిండాలను తొలగించాం. ఒకట్రెండు పిండాలు ఉన్న కేసులను చూశాం. కానీ ఇది చాలా అరుదైన కేసు” అని డాక్టర్ ఎండీ ఇమ్రాన్ చెప్పారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం బాగుందని చెప్పారు.