థానే: కాంగ్రెస్, బీజేపీ.. రెండూ ఒకదానికొకటి బద్ధ శత్రువుల్లాంటి రాజకీయ పార్టీలు. ఈ రెండు పార్టీల సిద్ధాంతాలు వేరు. విధివిధానాలు వేరు. అలాంటి ఈ రెండు పార్టీలు మహారాష్ట్రలో జత కట్టాయనే వార్తలు గుప్పుమన్నాయి. స్థానిక ఎన్నికల్లో శివసేనను ఓడించేందుకు కాంగ్రెస్ తో జట్టు కట్టాలని స్థానిక బీజేపీ తీసుకున్న నిర్ణయం విమర్శలకు కారణమైంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మహారాష్ట్రలోని థానే జిల్లాలో అంబర్ నాథ్ మున్సిపల్ కౌన్సిల్కు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనను ఓడించడానికి కాంగ్రెస్తో జత కట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఈ కలయిక మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే.. మహారాష్ట్ర కాంగ్రెస్ మాత్రం బీజేపీతో ఎటువంటి పొత్తు లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. బీజేపీతో పొత్తుకు సుముఖత వ్యక్తం చేసిన అంబర్ నాథ్ బ్లాక్ చీఫ్ ప్రదీప్ పాటిల్ను, కార్పొరేటర్లను పార్టీ గీత దాటారనే కారణంగా మహారాష్ట్ర కాంగ్రెస్ సస్పెండ్ చేసింది.
►ALSO READ | కుక్క కరిచే మూడ్‌లో ఉందో లేదో ఎలా తెలుస్తుంది ?: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
