సైబర్​క్రైమ్స్​కి​ అడ్డా ఈ పది జిల్లాలే

సైబర్​క్రైమ్స్​కి​ అడ్డా ఈ పది జిల్లాలే
  • 80 శాతం ఇక్కడే నుంచే
  • రాజస్థాన్​ భరత్​పూర్​ నుంచి  మరీ ఎక్కువ
  • వెల్లడించిన తాజా స్టడీ రిపోర్టు

న్యూఢిల్లీ: సైబర్​క్రైమ్స్​కు  ఝార్ఖండ్​లోని జామ్​తారా అడ్డా. ఇప్పుడు రాజస్థాన్​లో భరత్​పూర్​ ప్రాంతం దీనికి జిరాక్స్​కాపీలా మారింది. భరత్​పూర్​తో పాటు హర్యానాలోని నూహ్​, ఉత్తరప్రదేశ్​లోని మథుర  నుంచి సైబర్​క్రైమ్స్​పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మరో ఏడు జిల్లాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇండియాలో జరుగుతున్న సైబర్​క్రైమ్స్​లో 80 శాతం ఇక్కడి నుంచే జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐఐటీ కాన్పూర్​లో ఇన్​క్యుబేట్​​అవుతున్న స్టార్టప్ ఫ్యూచర్​ క్రైమ్​ రీసెర్చ్​ ఫౌండేషన్​(ఎఫ్​సీఆర్​ఎఫ్​)​‘ఈ డీప్​ డైవ్​ఇంటూ సైబర్​క్రైమ్​ ట్రెండ్స్​ ఇంపాక్టింగ్​ ఇండియా’ పేరుతో విడుదల చేసిన రిపోర్టు ద్వారా ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. 18 శాతం నేరాలతో భరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ మొదటి స్థానంలో ఉండగా, మిగతా స్థానాల్లో  మధుర (12శాతం), నూహ్ (11శాతం), దేవ్​గఢ్​ (10శాతం), జామ్​తారా (9.6శాతం), గురుగ్రామ్ (8.1శాతం), అల్వార్ (5.1శాతం), బొకారో (2.4శాతం), కర్మ తాండ్ (2.4శాతం)  గిరిదిహ్ (2.3శాతం)  ఉన్నాయి. "మా స్టడీ రిపోర్ట్​ భారతదేశంలో సైబర్ నేరాలకు ఎక్కువగా అవకాశం ఉన్న 10 జిల్లాలపై దృష్టి సారించింది. ఈ జిల్లాల్లో సైబర్ నేరాలకు దోహదపడే ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకున్నాం. నేరాలకు అడ్డుకట్టవేయడానికి తగిన ప్లాన్లను రూపొందించడం చాలా అవసరం" అని ఎఫ్​సీఆర్​ఎఫ్​ కో–ఫౌండర్​ హర్షవర్ధన్ సింగ్ అన్నారు. ఈ పది జిల్లాలు భారతదేశంలోని టాప్ 10 సైబర్ క్రైమ్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా  మారాయని చెప్పారు.  ప్రధాన పట్టణ కేంద్రాలకు దగ్గరగా ఉండటం వల్ల ఈ జిల్లాల్లో నేరాల సంఖ్య ఎక్కువ ఉంది.  సైబర్ భద్రతా మౌలిక సదుపాయాలు తక్కువగా ఉండటం, ఆర్థిక సమస్యలు,  తక్కువ డిజిటల్ అక్షరాస్యత వల్ల జనం సైబర్ ​క్రిమినల్స్​ చేతుల్లో మోసపోతున్నారని ఆయన వివరించారు.

నేరాలు ఎలా చేస్తారంటే..

సైబర్​ నేరగాళ్లు హ్యాకింగ్ టూల్స్​, మాల్వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఉపయోగించి సైబర్​ నేరాలకు  పాల్పడుతున్నారు.   నో యువర్​ కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కేవైసీ), వెరిఫికేషన్​ ప్రాసెస్​ను  ఆన్​లైన్​లో చేసుకోవడం  ద్వారా సైబర్​క్రిమినల్స్​ నకిలీ ఐడీలను, ఇతర కార్డులను సృష్టిస్తున్నారు. దీంతో అధికారులకు ఇలాంటి  వారిని గుర్తించడం సవాలుగా మారింది. అంతేకాదు వీళ్లకు బ్లాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నకిలీ ఖాతాలు అందుబాటులో ఉంటున్నాయి.  అద్దెకు సిమ్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు దొరుకుతున్నాయి. వీటి సాయంతో నేరాలు చేస్తున్నారు. అందుకే క్రిమినల్స్​ను ట్రాక్​ చేయడం, ప్రాసిక్యూట్ చేయడం సవాల్​గా మారుతోంది. తక్కువ ధరకు దొరికే ఏఐ సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎటాక్ టూల్స్​తో  రెచ్చిపోతున్నారు. వర్చువల్ ప్రైవేట్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను (వీపీఎన్​) ఉపయోగిస్తున్న కారణంగా సైబర్ నేరగాళ్ల వివరాలను తెలుసుకోవడం కష్టమవుతోంది.  సైబర్ క్రైమ్ సిండికేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిరుద్యోగులను చేర్చుకొని వారికి సైబర్​ నేరాలపై శిక్షణ కూడా ఇస్తున్నాయి.