దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 8,084

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 8,084

దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి తీవ్రత కొద్దికొద్దిగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 8,084 కరోనా కేసులు నమోదుకాగా, 10 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 4,592 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.  దేశంలో ఇప్పటివరకు మొత్తం కేసులు 4,32,30,101కు చేరాయి. అదే సమయంలో 5,24,771 మంది మరణించారు. 4,26,57,335 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇంకా 47,995 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 

దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.68 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.10 శాతం వద్ద ఉంది.రోజువారి పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉంది. ఇప్పటివరకు 1,95,19,81,150 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపింణీ చేశామని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 11,77,146 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని ఆరోగ్య శాఖ పేర్కొన్నది. ఇక కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 2946 కేసులు, కేరళలో 4319, ఢిల్లీలో 735, కర్ణాటకలో 463, హర్యానాలో 304 నమోదైనట్టు కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది.