
- 81 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రమోషన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 81 ప్రిన్సిపాల్ పోస్టులకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ఇంటర్మీడియెట్ కమిషరేట్ ప్రకటించింది. 81 మంది అర్హులైన జూనియర్ లెక్చరర్లకు ప్రమోషన్ ఇవ్వనున్నట్టు వెల్లడించింది.
నాంపల్లిలోని ఇంటర్ విద్యాశాఖ డైరెక్టరేట్లో సోమవారం ఉదయం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని తెలిపింది. ఎంపికైన జూనియర్ లెక్చరర్లు అటెండ్ కావాలని డైరెక్టర్ కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు.