కార్తీకమాసంలో రాజన్నకు 8.25 కోట్ల ఆదాయం

కార్తీకమాసంలో రాజన్నకు 8.25 కోట్ల ఆదాయం

వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి కార్తీక మాసంలో కాసుల వర్షం కురిసింది. నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని వివిధ రూపాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని హుండీ ద్వారా రూ. 8 కోట్ల 25 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

హుండీ ద్వారా రూ.2 కోట్ల 98 లక్షలు, కోడె టికెట్ల ద్వారా రూ.కోటి 31 లక్షల 77 వేలు, ప్రసాదం ద్వారా రూ.కోటి 50 లక్షల 91 వేలు, వసతి గదులతో రూ.30 లక్షల 62 వేలు, రుద్రాభిషేకం టికెట్లతో రూ.33 లక్షల 91 వేలు, శీఘ్ర దర్శనం టికెట్లతో రూ.13 లక్షల 17 వేలు, కల్యాణాలతో రూ.25 లక్షల 17 వేలు, పల్లకి, పెద్ద సేవల టికెట్లతో రూ. 2 లక్షలు, సత్యనారాయణ వ్రతాలతో రూ. 5 లక్షల 45 వేలు, అనుబంధ ఆలయాల ద్వారా రూ.11 లక్షల 95 వేలు, ఇతరత్రా ఆదాయం రూ. 2 కోట్ల 56 లక్షలు వచ్చింది. రూ. 80 లక్షలు దేవాలయం లీజులు, లైసెన్స్ ద్వారా సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.