విదేశీ జైళ్లలో 8,330 మంది భారతీయులు.. అధికశాతం ఏ దేశంలో అంటే?

విదేశీ జైళ్లలో 8,330 మంది భారతీయులు.. అధికశాతం ఏ దేశంలో అంటే?

ప్రస్తుతం 8330 మంది భారతీయులు విదేశీ జైళ్లలో మగ్గుతున్నారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. వీరిలో ఎక్కువ మంది యూఏఈ, సౌదీ అరేబియా, నేపాల్‌లో శిక్ష అనుమభావిస్తున్నారని ఆయన శుక్రవారం లోక్‌సభకు వెల్లడించారు. 

అండర్ ట్రయల్‌తో సహా మొత్తం1611 మంది భారతీయులు.. యూఏఈ జైళ్లలో శిక్ష అనుభవిస్తుండగా, ఆ తర్వాత 1461 మందితో సౌదీ అరేబియా రెండో స్థానంలో, 1222 మందితో నేపాల్‌ మూడో స్థానంలో ఉన్నాయి.

భారత ప్రభుత్వం 31 దేశాలతో ఖైదీల బదిలీ ఒప్పందంపై సంతకం చేసిందని తెలిపిన  జైశంకర్.. విదేశాల్లోని భారత ఖైదీల భద్రతకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. అలాగే, వారిని విడిపించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.