ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్.. నమోదైన కేసుల్లో 50శాతం మరణాలు.. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన WHO

ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్.. నమోదైన కేసుల్లో 50శాతం మరణాలు.. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన WHO

ఎబోలా వైరస్ .. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న  ప్రాణాంతక వైరస్.. వ్యాక్సిన్లు లేవు..  మధ్యఆఫ్రికాలోని ఉగాండా, కాంగో దేశాల్లో బీభత్సం సృస్టిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ దేశాల్లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇప్పుడు నెమ్మదిగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. మన దేశంలో విమానాశ్రయాల్లో ప్రత్యేకంగా ఎబోలా డిటెక్టింగ్ ఏర్పాట్లు చేశారు.  నమోదు కేసుల్లో దాదాపు 50 శాతం మరణాలు సంభవిస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తి  ఆందోళన రేకెత్తిస్తోంది. 

మధ్య ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. నిన్నటి(శనివారం మే23 రాత్రి )వరకు ఆ దేశంలో 867 కేసులు, 204 మరణాలు నమోదయ్యాయి.దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆ దేశంలో అత్యవసర పరిస్థతిని ప్రకటించింది.  ఈ వైరస్ ముఖ్యంగా DRCలోని మూడు ప్రావిన్స్ లలో ఎక్కువగా  వ్యాప్తిలో ఉంది. దక్షిణ కివులో తొలి కేసు నమోదు అయ్యింది.  పక్క దేశం ఉగాండాలోనూ వేగంగా వ్యాపిస్తోంది వైరస్.. ఎబోలాతో ఒకరు చనిపోయారు. దీంతో ఉగాండా సరిహద్దులను మూసివేసింది. 

ఎబోలా వైరస్ వేరియంట్లలో అరుదైన బుండిబుగ్యో స్ట్రెయిన్  వైరస్ కు టీకాలు లేవు. మరణాలు రేటు 50 శాతం కంటే పైనే ఉంది. ఈ వైరస్ గుర్తింపునకు రెండు నెలల ముందే తూర్పూకాంగోల వివాదాస్పదమైన మైనింగ్ ప్రాంతం ఇటూరి ప్రావిన్స్ లో ఈ వైరస్ వ్యాపించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 

ఎబోలా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. కేసులు పెరుగుతున్నాయి.పరిస్థితి ఇంకా అదుపులకి రాలేదని WHO ప్రతినిధి అన్నే అన్సియా చెప్పారు. ఎబోలా ఎఫెక్టతో కాంగో లోని బునియా పట్టణానికి విమాన సర్వీసులు రద్దు చేశారు. ఉగాండా, డీఆర్సీ మధ్య సరిహద్దులు మూసివేశారు. విమాన సర్వీసులు, సరుకు రవాణా, ఆహార పదార్ధాల రవాణా మినహా ప్రజారవాణాను నిలిపివేసింది.