
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో బీసీ గురుకులాల్లోని 6,7,8 తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షకు 87.4 శాతం మంది హాజరయ్యారని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు 86.7 శాతం, ఏడో తరగతి కోసం 89.8శాతం, ఎనిమిదో తరగతి కోసం 84.8 శాతం స్టూడెంట్స్ హాజరయ్యారని వెల్లడించారు. ఆరో తరగతిలో 1,223, ఏడో తరగతిలో 893, ఎనిమిదో తరగతిలో 636 సీట్లను భర్తీ చేస్తామని పేర్కొన్నారు.