
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం రణరంగం అయ్యింది.. మూడే మూడు గంటల్లో ఎనిమిది హత్య చేయబడ్డారు. జులై 8వ తేదీ ఉదయం మొదలైన పంచాయితీ ఎన్నికల సందర్భంగా.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలు తెగబడ్డాయి. అధికార మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు తమ బలం ఉన్న చోట ప్రతాపం చూపించారు. తుపాకులు, కత్తులు, రాడ్లతో పోలింగ్ బూతులపై తెగబడ్డారు కార్యకర్తలు.
మూడు గంట్లోనే ఎనిమిది హత్యలు జరగటంతోపాటు పోలింగ్ బూతుల్లోనే ఏజెంట్లను నరికి చంపారు. రోడ్లపై తుపాకులతో స్వైర విహారం చేశారు. కొట్లాటలు, దొమ్మీలు అతి సహజం అన్నట్లు సాగుతున్నాయి పంచాయతీ ఎన్నికలు పశ్చిమ బెంగాల్ లో. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ బూతుల్లోని బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లారు... మరికొన్ని చోట్ల తగలబెట్టారు.. బ్యాలెట్ పేపర్లను చింపిపడేశారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీల ఇళ్లపై దాడులు చేశారు.. వాళ్ల ఆస్తులకు నిప్పుపెట్టారు. వాహనాలను వీధుల్లో ధ్వంసం చేశారు.. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి.
TMC goons openly brandish gun and threaten an independent candidate in Barrackpore, North 24 Parganas.
— Amit Malviya (@amitmalviya) July 8, 2023
9 people have died since morning and no one knows how many more will die through the day. SEC and Mamata Banerjee are responsible for this bloodshed. They didn’t deploy CAPF… pic.twitter.com/t5XjDl6c1c
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో మూడు గంటల్లో జరిగిన తొమ్మిది హత్యల్లో.. ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు సభ్యులు, బీజేపీ, లెఫ్ట్, కాంగ్రెస్‌లకు చెందిన కార్యకర్తలు, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారు ఉన్నారని అధికారులు తెలిపారు. వీటితో పాటు రెండు పోలింగ్ బూత్‌లలో ఆందోళనకారులు బ్యాలెట్ బాక్సులను ధ్వంసం చేసినట్లు స్పష్టం చేశారు.
భద్రతకు సంబంధించిన కేంద్ర బలగాల భారీ వైఫల్యం వల్లే ఈ తరహా ఘటనలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని ఈ సందర్భంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. జూన్ 8న ఎన్నికలు ప్రకటించిన రోజు నుంచి బెంగాల్ అంతటా పెద్దఎత్తున హింస చెలరేగడం ప్రారంభమయ్యాయి.