అఫ్గనిస్తాన్ లో భారీ భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు

అఫ్గనిస్తాన్ లో  భారీ భూకంపం.. ఢిల్లీలోనూ  ప్రకంపనలు

అఫ్గనిస్తాన్ లో అర్థరాత్రి పర్వత హిందూ కుష్ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చింది.  రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. సెప్టెంబర్ 1న(  అర్థరాత్రి 12:47 నిమిషాలకు) ఈ భూకంపం వచ్చిందని వెల్లడించింది. పాకిస్తాన్ కు సరిహద్దులో  10 కి.మీ లోతున భూకంపం వచ్చింది.  ఈ భూకంపం దాటికి తొమ్మిది మంది మరణించగా..దాదాపు 15 మందికి తీవ్రగాయాలయ్యాయని ఆఫ్ఘన్ నంగర్హార్ ప్రజారోగ్య శాఖ ప్రతినిధి నకిబుల్లా రహీమి తెలిపారు

అఫ్గనిస్తాన్ భూకంపం ప్రభావంతో  పాకిస్తాన్ తో పాటు  ఉత్తర భారతదేశం, ఢిల్లీలోని ఎన్ సీఆర్ లో  భూ ప్రకంపనలు సంభవించాయి. పలు చోట్ల భవనాలు కంపించడంతో  ప్రజలు బయటకు పరుగులు తీశారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం కానీ జరగలేదని తెలుస్తోంది. 

 ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపాలు రావడం సర్వసాధారణం,  హిందూకుష్ పర్వత ప్రాంతంలో  ప్రతి సంవత్సరం భూకంపాలు సంభవిస్తాయి. ఆగస్టు 2న 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని లోతు 87 కిలోమీటర్లు. ఆగస్టు 6న 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.