తొమ్మిది రాష్ట్రాల్లో  సీబీఐకి నో ఎంట్రీ

తొమ్మిది రాష్ట్రాల్లో  సీబీఐకి నో ఎంట్రీ

న్యూఢిల్లీ: ముందస్తు అనుమతి లేకుండా తమ రాష్ట్రంలోకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎంట్రీని9 రాష్ట్రాలు రద్దు చేశాయి. చత్తీస్‌‌గఢ్, బెంగాల్, రాజస్థాన్ సహా 9 రాష్ట్రాలు సీబీఐకి ‘సాధారణ అనుమతి’ని కిందటేడాది ఉపసంహరించుకున్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభకు వెల్లడించారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌‌మెంట్ (డీఎస్‌‌పీఈ) చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం,  సీబీఐ తన అధికార పరిధి అయిన ఢిల్లీ తప్ప.. మరే ఇతర రాష్ట్రంలో దర్యాప్తు చేయాలన్నా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. చత్తీస్‌‌గఢ్, జార్ఖండ్, కేరళ, మేఘాలయ, మిజోరాం, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, బెంగాల్ రాష్ట్రాలు ఇప్పటివరకు సీబీఐకి సాధారణ అనుమతిని వాపస్ తీసుకున్నాయని మంత్రి పేర్కొన్నారు.