90% మంది ఇంకా వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోమే!

90% మంది ఇంకా వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోమే!

పర్మినెంట్‌‌గా హైబ్రిడ్ మోడల్‌‌ ఉండాలి: ప్రేమ్‌‌జీ

న్యూఢిల్లీ: ఐటీ ఇండస్ట్రీలో 90 శాతానికి పైగా ఉద్యోగులు  ఇంకా వర్క్ ఫ్రమ్‌‌ హోం  మోడల్‌‌లోనే  పనిచేస్తున్నారని విప్రో ఫౌండర్‌‌‌‌ అజీమ్‌‌ ప్రేమ్‌‌జీ అన్నారు. ‘కరోనా లాక్‌‌డౌన్ వలన 90 శాతానికి పైగా ఐటీ వర్క్ ఫోర్స్‌‌ వర్క్ ఫ్రమ్‌‌ హోం విధానంలో పనిచేశారు. ఇప్పుడు కూడా 90 శాతానికి పైగా వర్క్‌‌ఫోర్స్‌‌ ఇదే మోడల్‌‌లో వర్క్ చేస్తోంది’ అని పేర్కొన్నారు. బెంగళూరు ఛాంబర్‌‌‌‌ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్‌‌ నిర్వహించిన సెషన్‌‌లో ఆయన మాట్లాడారు. ఐటీ ఇండస్ట్రీలో హైబ్రిడ్ మోడల్‌‌ను పర్మినెంట్‌‌గా తీసుకురావాలని కోరారు. కరోనా సంక్షోభం ముగిసినా ఉద్యోగులు ఆఫీస్ నుంచి, ఇంటి నుంచి కూడా పనిచేసుకునే అవకాశాన్ని కల్పించాలని ప్రేమ్​జీ ఈ సందర్భంగా చెప్పారు.