ఫోన్లు చూస్తూనే నిద్రపోతున్నరు

V6 Velugu Posted on Apr 07, 2021

  • 94 శాతం హైదరాబాదీల్లో ఇదే అలవాటు
  • నిద్ర అలవాట్లపై ‘వేవ్ ఫిట్ డాట్ కో స్టడీ’  రిపోర్ట్
  • దేశ వ్యాప్తంగా నాలుగేళ్లలో ప్రధాన నగరాల్లో సర్వే

హైదరాబాద్, వెలుగు: నగర వాసులు నిద్రపోయే ముందు కూడా ఫోన్లనే చూస్తున్నరట. వేక్ ఫిట్ డాట్ కో సంస్థ దేశవ్యాప్త సర్వేలో ఇది తేలింది. జనాల్లో నిద్ర అలవాట్లపై ‘గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డ్ -జీఐఎస్ఎస్ – 2021’  పేరిటీ ఇటీవల రిపోర్ట్ విడుదల చేసింది. దీని ప్రకారం.. దాదాపు 94 శాతం మంది హైదరాబాదీలు నిద్రపోయే ముందు ఫోన్లలోనే గడిపేస్తున్నరని పేర్కొంది. గతేడాది ఇది 91శాతం ఉండగా, ఇప్పుడు 3 శాతం ఎక్కువగా పెరిగింది. రిపోర్ట్లో వెల్లడించిన ప్రకారం 80 శాతం మంది పనిచేసేటప్పుడు వారంలో ఒకటి నుంచి మూడు రోజులు మగతగా ఉంటోందని పేర్కొన్నారు. మరో 26 శాతం మంది ల్యాప్ ట్యాప్, స్మార్ట్ ఫోన్లలో సినిమాలు చూస్తున్నామని చెప్పారు. ఇంకో 16 శాతం మంది బెడ్పై పడుకుని ల్యాప్ ట్యాప్, స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తూ వర్క్ చేశామని వెల్లడించారు. ఇందులో వెన్నెముక సమస్యలతో బాధపడుతున్న వారు 40 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. 90 శాతం దాకా మంది ఒకటి నుంచి రెండుసార్లు నిద్ర మధ్యలో మేల్కొంటున్నారని పేర్కొంది.దేశంలోని ప్రధాన నగరాల్లో నిద్ర అలవాట్లపై   నాలుగేళ్లుగా సర్వే చేస్తున్నాం, లక్ష మంది రెస్పాండ్ అయ్యారు. ఈ ఏడాది16 వేల మందికి పైగా స్పందించారు.’ అని వేక్ ఫిట్ కో డైరెక్టర్, కో- ఫౌండర్  చైతన్య రామలింగ గౌడ తెలిపారు. ఐటీ హబ్గా హైదరాబాద్ వృద్ధి చెందడంతో యూత్ అర్ధరాత్రి వరకు వర్క్ చేయడం, సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లతోనే టైం స్పెండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. జనాలు రాత్రి పూట గాడ్జెట్లతో ఎక్కువ సేపు గడపడం వల్ల నిద్రలేమికి గురవుతున్నారని, దీని కారణంగా పని చేస్తున్నప్పుడు నిద్ర మబ్బుతో ఉంటున్నామనే వారి సంఖ్య పెరిగిందని చెప్పారు. నిద్రలేమి సమస్య దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను తెచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు. నిద్రలేమితో పాటు  నిద్ర ప్రాముఖ్యత గురించి కూడా ఈ ఏడాది సర్వేలో పేర్కొంది.  నిద్ర ఇంపార్టెన్స్ పై  హైదరాబాదీలు మూడు అభిప్రాయాలు తెలిపారు.  

నిద్ర ఇంపార్టెన్స్ పై సిటిజన్స్ ఇచ్చిన ప్రాధాన్యం 
నిద్రపోయే క్రమం                             శాతం
మంచి బెడ్స్ పై నిద్ర                          38
ల్యాప్ టాప్, ఫోన్ చూస్తూ నిద్ర                 32
అలవాట్లను మెరుగుపరుచుకొని నిద్ర          28

 

Tagged study report, Hyderabad, Mobile Phones, watching, sleeping

More News