
- కంపెనీల నిర్ణయం వెల్లడించిన లింక్డ్‌ఇన్ సర్వే
న్యూఢిల్లీ: అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా దూసుకుపోతుండటంతో మనదేశంలోని దాదాపు 94శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు కొత్త స్కిల్స్‌ను నేర్పిస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ చేసిన సర్వే తెలిపింది. ఈ సంస్థ తాజా వర్క్‌ప్లేస్ లెర్నింగ్ రిపోర్ట్ ప్రకారం, 2024లో కంపెనీలకు.. నైపుణ్యం పెంచడం, వ్యాపార లక్ష్యాల కోసం నేర్చుకోవడం, నేర్చుకునే సంస్కృతిని సృష్టించడం...
అనేవి మొదటి మూడు మొదటి ప్రాధాన్యతలు. 53శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు ఆన్‌లైన్ శిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలను అందించాలని చూస్తున్నాయి. ఆఫీసుల్లో ఏఐకి విపరీతమైన ప్రాధాన్యం పెరగడంతో, మనదేశంలోని 98శాతం మంది కంపెనీలు ఉద్యోగ అభ్యర్థుల నుంచి నైపుణ్యాలను కోరుకుంటున్నాయి. కంపెనీలు ఏఐ నైపుణ్యం మాత్రమే కాకుండా సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకునే సామర్థ్యం ఉన్న అభ్యర్థులకు విలువ ఇస్తున్నాయి. మనదేశంలోని 91శాతం లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ నిపుణులు ఆర్థిక వ్యవస్థలో మానవ నైపుణ్యాలను కీలకంగా చూస్తున్నారని రిపోర్ట్ వెల్లడించింది.
భారతదేశంతో సహా ఏపీఏసీ లోని అన్ని దేశాలలో 2024లో 'కమ్యూనికేషన్' అత్యంత డిమాండ్ ఉన్న నైపుణ్యం అని లింక్డ్‌ఇన్ రిపోర్ట్ తెలిపింది. ఏఐ కాలంలో భారతదేశంలోని మేనేజర్లను నియమించుకునేముందు కంపెనీలు వారిలో సరైన ఆలోచన విధానం, సమస్య పరిష్కారం వంటి సాఫ్ట్ స్కిల్స్ కోసం చూస్తున్నాయి.చాట్ జీపీటీల వంటివి వచ్చాక కూడా తమ సైట్లో జాబ్పోస్టింగ్స్ పెరిగాయని లింక్డ్‌ఇన్ ఇండియాలో టాలెంట్, లెర్నింగ్ ఎంగేజ్‌మెంట్ సొల్యూషన్స్ సీనియర్ డైరెక్టర్ రుచీ ఆనంద్ అన్నారు. ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందించడానికి ఉద్యోగ భద్రతను పెంపొందించడానికి, భారతదేశంలోని 53శాతం కంపెనీలు ఆన్‌లైన్ శిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తున్నాయని ఆమె వివరించారు.