94 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్

94 ఏళ్ల వయసులో  గోల్డ్ మెడల్

ప్రతిభకు వయసు అడ్డు కాదని భారత్కు చెందిన భగవానీదేవి దాగర్ నిరూపించింది. హర్యానాకు చెందిన ఈ 94 ఏళ్ల బామ్మ..ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో  గోల్డ్ మెడల్ సాధించింది.  

ఫిన్లాండ్లోని టాంపేర్ సిటీలో జరుగుతున్న వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో 100 మీటర్ల స్ప్రింగ్ ఈవెంట్లో భగవానీ దేవి బంగారు పతకం సాధించింది. సీనియర్ సిటిజన్ విభాగంలో పోటీపడిన ఆమె.. 100 మీటర్లను  24.74 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సాధించింది.


 
ఈ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకంతో పాటు భగవానీదేవి మరో రెండు కాంస్య పతకాలను ఖాతాలో వేసుకుంది. షాప్ పుట్ ఈవెంట్ లో మూడో స్థానంలో నిలిచి బ్రౌంజ్ మెడల్ను సాధించింది. అలాగే మరో ఈ వెంట్లో కాంస్య పతకాన్ని దక్కించుకుని టోర్నీలో  మొత్తం మూడు పతకాలను సొంతం చేసుకుని ఔరా అనిపించింది.  మూడు పతకాలను మెడలో ధరించి విజయ గర్వంతో   త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న బామ్మ ఫోటో ప్రస్తుతం వైరల్గా మారింది. కేంద్ర క్రీడా శాఖ భగవానీదేవిని అభినందిస్తూ.. ట్విట్టర్లో ఆమె ఫోటోను పోస్ట్ చేసింది.

గోల్డ్తో సహా మూడు పతకాలను సాధించిన బామ్మ భగవానీదేవి యావత్ దేశానికే కాదు ప్రపంచానికి  స్పూర్తిగా నిలిచింది. ఆమె ప్రతిభ, పట్టుదలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 94 ఏళ్ల వయసులోనూ  ఎంతో ఉత్సాహంతో సాధారణ  మనుషుల వలే పరుగెత్తిన బామ్మ గోల్డ్ మెడల్ సాధించడం మామూలు విషయం కాదని మెచ్చుకుంటున్నారు.