అంగరంగ వైభవంగా ఆస్కార్ ప్రదానోత్సవం

అంగరంగ వైభవంగా ఆస్కార్ ప్రదానోత్సవం

లాస్ ఏంజిల్స్: 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన ఈ ఉత్సవంలో ప్రపంచ నలుమూలలా నుంచి సినీ నటులు, టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు. వివిధ కేటాగిరిల్లో బెస్ట్ పర్ఫార్మర్స్ కు అవార్డులు అందజేశారు.  కరోనా వల్ల గత రెండేళ్లు సాదాసీదాగా జరిగిన ఆస్కార్ అవార్డుల ఉత్సవం ఈ సారి గ్రాండ్ గా జరిగింది. ఈ అవార్డుల వేడుకలో డ్యూన్ చిత్రం హవా సాగింది. ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్, విజువల్ ఎఫ్టెక్స్ విభాగాల్లో ఆస్కార్ అవార్డుని డ్యూన్ ఫిల్మ్ క్రూ గెలుచుకుంది. కగా తొలిసారి అత్యుత్తమ చిత్రం రేసులో 10 చిత్రాలు పోటీ పడ్డాయి. ఈ కార్యక్రమానికి  హోస్ట్ లుగా  అమీ షుమెర్, వాండా సైక్స్, రెజీనా హాల్ వ్యవహరించారు. 

ఎవరెవరికి, ఏ ఏ విభాగాలకు...

బెస్ట్ యాక్టర్:  విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్)

బెస్ట్ మూవీ:  కోడా

బెస్ట్ యాక్ట్రెస్:  జెస్సికా చాస్టియన్ (ది అయిస్ ఆఫ్ టమ్మీ  ఫేయ్)

ఉత్తమ సౌండ్ ,సినిమాటోగ్రఫీ ,విజువల్ ఎఫెక్ట్ : డ్యూన్

సహాయ నటి: అరియానా డిబోస్ 

ఉత్తమ యానిమేషన్ చిత్రం: ఎంకాంటో

ఉత్తమ లఘు చిత్రం: ద విండ్ షీల్డ్ వైపర్ 

ఉత్తమ డాక్యుమెంటరీ: ద క్వీన్ ఆఫ్ బాస్కెట్ బాల్.

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : సియాన్ హెడెర్ (కొడా) 

ఉత్తమ ఎడిటింగ్: జో వాకర్ ( డ్యూన్ )

ఉత్తమ దర్శకత్వం: జెన్ కాంపియన్ ( ది పవర్ ఆఫ్ డాగ్ ) 

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: కెన్నెత్ బ్రనాగ్ (కెన్నెత్ బ్రనాగ్ )

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: జెన్నీ బేవన్ (క్రుయెల్లా)

మరిన్ని వార్తల కోసం..

ఢిల్లీ..బోణీ

ముల్తానీ మెరుపులు