ముల్తానీ మెరుపులు

ముల్తానీ మెరుపులు

ముఖం మీద వచ్చే మొటిమలు, మచ్చలతో ఇబ్బంది పడతారు చాలామంది. ఎండలో బయటికి వెళ్తే చాలు టాన్​ సమస్య వస్తుంది కొందరికి. ఫేస్​క్రీమ్స్ రాసుకున్నా కూడా ఫలితం ఉండదు. అలాంటప్పుడు బ్యూటీ రొటీన్​లో ముల్తానీ మట్టిని చేర్చాలి. ఈ మట్టితో చేసిన ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఇందులోని మినరల్స్ ముఖం మీది చర్మం ఒకే రంగులో కనిపించేలా చేస్తాయి.  అంతేకాదు చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా మార్చుతాయి. 

ముల్తానీ మట్టిలో  కొన్ని నీళ్లు లేదా రోజ్​ వాటర్ కలిపి మెత్తని పేస్ట్ తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్​ని ముఖానికి రాసుకుని 10‌– 15 నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఇలాచేస్తే ఎండాకాలంలో వచ్చే టాన్​ తగ్గుతుంది. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు ముల్తానీ మట్టి ఫేస్​ప్యాక్ వేసుకుంటే చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. 
ఈ మట్టి సెబంను పీల్చుకోవడమే కాకుండా జిడ్డు, చర్మం మీది మలినాల్ని పోగొడుతుంది. అంతేకాదు డెడ్ స్కిన్ సెల్స్​ని తొలగించి చర్మాన్ని ఫ్రెష్​గా చేస్తుంది.
ముల్తానీ మట్టి, అలొవెరా జెల్​ ఫేస్​ప్యాక్ కూడా ముఖాన్ని మెరిపిస్తుంది. టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, అలొవెరా జెల్ కలిపి ఫేస్​ప్యాక్ తయారుచేసుకోవాలి. ఈ ప్యాక్​ని ముఖానికి రాసుకుని 10 నిమిషాలు 
అలాగే ఉండాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.