హజ్ యాత్రలో 98 మంది మృతి

హజ్ యాత్రలో  98 మంది మృతి

న్యూఢిల్లీ: హజ్ యాత్ర సందర్భంగా ఈ ఏడాది లో ఇప్పటివరకు 98 మంది ఇండియన్లు మరణించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. పలు ప్రమాదాల్లో నలుగురు మినహా మిగతావారంతా దీర్ఘకాలిక అనారోగ్యాలు, వృద్ధాప్య సమస్యల కారణంగా ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. ఈ ఏడాది ఇప్పటివరకు 1.75 లక్షల మంది మక్కాను సందర్శించినట్లు పేర్కొంది. 

రాష్ట్రానికి చెందిన ఆరుగురు మృతి

తెలంగాణ నుంచి హజ్ యాత్రకు వెళ్లిన వారిలో ఆరుగురు మరణించారు. హైదరాబాద్​కు చెందిన మహమ్మద్​అబ్దుల్​రహీమ్ ​ఆసిఫ్​ (55) జమారత్​లో గుండెపోటుతో.. సంగారెడ్డికి చెందిన సూరయ్య యస్మీన్​ (49), వహీద్​ రైసా(50) అధిక ఉష్ణోగ్రతల వల్ల చనిపోయారు. అలాగే.. రంగారెడ్డికి చెందిన మహమ్మద్​ తాజుద్దీన్​ (69), ఇలియాజ్ ​మహమ్మద్​(61) మక్కాలో  హార్ట్ఎటాక్​తో మరణించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. సౌదీ అరేబియాలో ప్రస్తుతం 50 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.