
రీల్స్ పిచ్చి.. పెద్దలు, యువతలోనే కాదు.. చిన్న పిల్లల్లో కూడా ఈ పిచ్చి ముదిరి.. చివరి ప్రాణాలమీదకు వస్తుంది. సరిగ్గా 10 యేళ్లు కూడా లేని చిన్నారులు.. ఇంటర్నెట్ చూస్తూ పెద్దలను అనుకరిస్తూ..రీల్స్ చేస్తున్నారు. ప్రమాదకరమైన ఫీట్లు చేస్తున్నారు. రీల్స్ విషయంలో తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రోత్సహిస్తుంచడం, ఖరీదైన, లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న సెల్ ఫోన్స్ వారి చేతిలో పెట్టడం చేస్తున్నారు.. ఇలా చేయడం వల్ల వారి పిల్లల భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా.. ఏకంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ని కల్పిస్తున్నారు. ఇలాంటి ఘటనకు మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ దుర్ఘటనే సాక్ష్యం..ఉరివేసుకొని ఫ్రాంక్ వీడియోలు చేసి ఇంటర్నెట్ లో షేర్ చేయాలని కొంతమంది పిల్లలు చేసిన చర్యలు ఓ బాలుడి ప్రాణాలు పోయేలా చేశాయి. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని మురైనా జిల్లాలో ఓ కుగ్రామం.. ఆ గ్రామానికి చెందిన ఓబాలుడు తన స్నేహితులతో కలిసి ఉరి వేసుకుంటున్నట్లు సరాదాగా ఓ రీల్ షూట్ చేస్తున్నాడు. రీల్ షూట్ విషాద షూట్ గా మారింది. చెప్పులు స్లిప్ అయి తాడు అతడి మెడకు బిగించుకుపోయింది. దీంతో ప్రాణాలు పోయాయి..ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.
వీడియోలో .. నలుగురు బాలురు రీల్ షూట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకరు బేస్ మెంట్ లాంటి గద్దెకు దగ్గరగా ఉన్న చెట్టుకు తాడు తగిలించి మెడకు వేసుకుని ఉండగా.. మరో ఇద్దరు సెల్ ఫోన్ లో షూట్ చేస్తున్నారు. అయితే ఆ సమయంలో చెప్పు జారడంతో నిజంగా మెడకు తాడు బిగుసుకొని విలవిల కొట్టుకుంటున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. మిగతావారు రీల్ లో భాగమని అనుకున్నారు. కొద్ది సేపటికే అతడి ప్రాణాలు పోయాయి.. దీంతో కొట్టుకోవడం ఆగిపోయింది. దగ్గరకు వెళ్లి చూసిన పిల్లలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో ఘటన స్థలానికి వచ్చి బాలుడి మృతదేహాన్ని కిందకు దింపారు.
ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా అయ్యో పాపం .. రీల్స్ సరదాగా చేస్తూ పర్వాలేదు. ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం మంచిది కాదు.. రీల్స్ చేసేవారు జాగ్రత్తలు పాటించాలి అంటు న్నారు.