హైదరాబాద్ లో పక్కకు ఒరిగిన పెద్ద అపార్ట్ మెంట్

హైదరాబాద్ లో పక్కకు ఒరిగిన పెద్ద అపార్ట్ మెంట్
  • రెండు అంతస్తులకే అనుమతులు, 4 ఫ్లోర్లతో నిర్మాణం
  •  బిల్డింగ్​ని కూల్చివేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయం

హైదరాబద్, వెలుగు :  బహదూర్ పురాలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురి చేసింది.  భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ అధికారులతో కలిసి భవనాన్ని పరిశీలించారు.  ఈ నిర్మాణానికి రెండు అంతస్తులకు మాత్రమే పర్మిషన్ ఉండగా గ్రౌండ్ తో పాటు నాలుగు ఫ్లోర్లు నిర్మించారు.  ఒరిగిన భవనం ప్రమాదకరంగా మారడంతో చుట్టుపక్కల ఇండ్లు, అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లలో నివాసం ఉన్న వారిని ఖాళీ చేయించారు.  భవన యజమాని రెండు ఫ్లోర్లకు మాత్రమే అనుమతి తీసుకొని, నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. 

మొదటి అంతస్తులో పగుళ్లను గుర్తించారు. భవనం ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో భవనాన్ని కూల్చి వేయాలని నిర్ణయించారు. పిల్లర్లు మొదటి అంతస్తు ఎప్పుడో నిర్మించి యజమానికి కొన్నేళ్ల తర్వాత అదే పిల్లర్లపై  భవనం నిర్మిస్తున్నాడు. పునాది బలంగా లేకుండా ఇటువంటి భారీ నిర్మాణాలు చేపట్టడంతోనే భవనం ఇలా  వంగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.  భవనాన్ని కూల్చివేసేందుకు ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారు. 

బిల్డింగ్ కూల్చివేత పూర్తి ఖర్చును ఓనర్ భరించేలా జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించడంతోపాటు గతంలో డెక్కన్ మాల్ ని  కూల్చివేసిన మాలిక్ ట్రేడింగ్ కంపెనీకి అప్పగించారు. మొత్తం రూ.27లక్షలకు కూల్చి వేసేందుకు ఇంటి యజమానితో ఆ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే 7 లక్షల రూపాయలు నిర్మాణం కూల్చివేత ఏజెన్సీకి ఓనర్ చెల్లించాడు.  నేడు కూల్చివేత పనులు మొదలెట్టారు. కూల్చివేత సమయంలో పక్కన ఉన్న ఓ భవనం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  ఈ నిర్మాణంపై నెల రోజుల క్రితమే స్థానికులు జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీకి  ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించ లేదని తెలిసింది.