
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన హరర్ థ్రిల్లర్ చిత్రం ' కిష్కింధపురి. ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేశారు . ఈ సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఏ హీరో చేయని సవాల్ ను చేసి సంచలనం సృష్టించారు. థియేటర్ లో తన సినిమా పది నిమిషాలు చూసిన తర్వాత కూడా ప్రేక్షకులు ఫోన్ చూస్తే చిత్ర పరిశ్రమను వదిలివెళ్లిపోతానని ఛాలెంజ్ చేశారు.
బెల్లంకొండపై సెటైర్లు
బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆయన కామెంట్స్ పై నెటిజన్లు పన్నీగా, సెటైరికల్ గా పోస్ట్ లు పెడుతున్నారు. 'హనుమాన్', 'గుంటూరు కారం' చిత్రాలు విడుదల టైం లో కూడా ఆ డైరెక్టర్లు ఇంతే కాన్ఫిడెంట్ గా చెప్పారు. చూద్దాం ఏం జరుగుతుందో అని కామెంట్స్ చేస్తున్నారు. మరొకరరు ఇలాంటివి సవాళ్లు చాలా చూశాం.. ప్రమాణం చేసిన వాళ్లు ఇక్కడే ఉన్నారంటూ సెటైర్లు వేశారు. మరికొందరు బెల్లం అన్న మాస్ స్టేట్ మెంట్ అంటూ కొనియాడారు. నేను వెళ్లిపోతా అన్నది బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి .. టాలీవుడ్ నుంచి కాదు అంటూ మరికొందరు జోక్ లు వేస్తూ పోస్ట్ చేశారు.
'మిరాయ్'తో పోటీ..
భారీ అంచనాలతో సెప్టెంబర్ 12న ' కిష్కింధపురి' విడుదల కానుంది . ఇదే రోజు తేజ సజ్జా, మంచు విష్ణు నటించిన మిరాయ్ పోటీ పడనుంది. ఈ క్లాష్ పై బెల్లంకొండ ఆవేదన వ్యక్తం చేశారు. మా సినిమా రిలీజ్ చేయాలనుకున్నప్పుడు మాకు సోలో స్లాట్ ఉంది. కానీ తర్వాత 'మిరాయ్' వస్తుందని చెప్పారు. ఈ సినిమా విడుదలపై మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ మూవీ టీం నుంచి కనీసం ఒక్క సమాచారం కూడా ఇవ్వలేదు . కనీస మర్యాద కూడా చూపరా అని అన్నారు.
కౌశిక్ పెగ్గాలపాటి దర్శకత్వం వహించిన 'కిష్కింధాపూరి' సినిమాలో బెల్లంకొండశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించారు. మరోవైపు కార్తీక్ ఘట్టమనేని, అనిల్ ఆనంద్ దర్శకత్వం వహించిన 'మిరాయ్' సినిమాలో తేజ సజ్జా, మంచు మనోజ్ , రీతికా నాయక్ నటించారు. ఈ రెండు చిత్రాలు ఒకే రోజు థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పిస్తాయో చూడాలి.