
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ తొలి వారమే ఊహించని మలుపులతో హీటెక్కిపోతుంది. సాధారణంగా మొదటి వారం హౌస్‌మేట్స్ మధ్య పెద్దగా గొడవలు ఉండవు అనుకుంటారు. కానీ ఈ సీజన్ అందుకు భిన్నంగా మొదలైంది. సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు రసవత్తరంగా మారింది. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో సెలబ్రిటీల కంటే 'కామనర్స్' (సామాన్యులు) మరింత యాక్టివ్‌గా, వ్యూహాత్మకంగా ఆడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
'సామాన్యుల' డామినేషన్
నామినేషన్ ప్రక్రియ మొదలవడంతో హౌస్ లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఘాటు వ్యాఖ్యలు, ఆరోపణలు, ప్రతి ఆరోపణలతో హౌస్ ఉడికిపోతోంది. బిగ్ బాస్ ఇచ్చిన 'సుత్తి' టాస్క్ నామినేషన్ ప్రక్రియను మరింత ఆసక్తికరంగా మార్చింది. ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటోను సుత్తితో కొట్టాలి. ఈ టాస్క్‌లో పోటీపడి భరణి గెలిచి, సంజనను నామినేట్ చేశాడు. ఆ తర్వాత సుత్తిని శ్రీజకి అందజేశాడు. ఈ క్రమంలో రాము రాథోడ్ - శ్రష్టి వర్మని, మాస్క్ మ్యాన్ హరీష్ - సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. ఈ నామినేషన్స్ సందర్భంగా హౌస్‌మేట్స్ మధ్య జరిగిన వాదోపవాదాలు హీటెక్కించేలా ఉన్నాయి.
సంజన Vs శ్రీజ
ఈ నామినేషన్ ప్రక్రియలో శ్రీజ, సంజనపై నేరుగా విరుచుకుపడింది. మీరు షాంపూ బాటిల్ బాత్‌రూమ్‌లో పెట్టి మాకు ఇబ్బంది కలిగించారు. మా మాట వినకుండా మీ స్టాండ్ మీదే ఉంటానన్నారు. అసలు అది స్టాండ్ కాదు అని సంజనపై మండిపడింది. పవన్ కూడా సంజనపై సీరియస్ అవుతారు. అలాగే, గత కొన్ని రోజులుగా తనపై కామెంట్లు చేస్తున్న తనుజను కూడా శ్రీజ నామినేట్ చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.
తనూజ Vs హౌస్‌మేట్స్
తనపై వస్తున్న ఆరోపణలపై తనూజ ఘాటుగా స్పందించింది. "మేము మనుషులం.. ఒక్కసారి చెబితే సరిపోతుంది. ప్రతి ఒక్కరు వచ్చి అదే మాటలు చెబితే ఎలా?" అని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమయంలో పవన్ "నువ్వు మనుషుల్లా చూడట్లేదు" అనడంతో తనుజ మరింత బాధపడింది. ఈ వాదోపవాదాల మధ్య హరీష్, నీ దయాదాక్షిణ్యాల మీద మేము బతుకుతున్నామా? అని ప్రశ్నించడంతో తనుజ, నా బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అని గట్టిగా బదులిచ్చింది. ఈ వివాదం చిలికిచిలికి గాలివానలా మారడంతో భరణి, మాస్క్‌మ్యాన్ హరీష్‌పైకి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా, ఇమ్మానుయేల్ అతన్ని అడ్డుకున్నాడు.
నామినేషన్స్ తర్వాత తనూజ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది. నామినేషన్ వల్ల కాదు, ఒక ఆడపిల్ల బిహేవియర్ గురించి ఇలా మాట్లాడటం బాధిస్తోంది. బయట ప్రపంచంలో ఇది ఎలా ప్రభావం చూపుతుందో అంటూ సుమన్ శెట్టితో తన ఆవేదనను పంచుకుంది. ఈ వారం హౌస్‌లో ఇంకా ఎలాంటి గొడవలు జరుగుతాయో చూడాలి.