రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో షాకింగ్ సంఘటన బయటపడింది. రన్నింగ్ లో ఉన్న BMW కారులో మంటలు చెలరేగాయి. హైవేపై కారు వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. ఈ ఘటన ఉదయపూర్ లోని చిర్వా టన్నెల్ వద్ద మే 5వ తేదీన జరిగింది.
రన్నింగ్ లో ఉన్న BMW కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అది పూర్దిగా దగ్ధమైంది. చూస్తుండగానే మంటల్లో కాలిపోయింది. ఈ దృశ్యాలను ఆ దారిలో వెళ్తున్న కొంతమంది తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానాకి వచ్చే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే భారీగా వ్యాపించిన మంటల్లో కారు పూర్తిగా తగలబడింది.
కారులో నుంచి మంటలు పెద్దగా వ్యాపించడంతో హైవేపై ప్రయాణిస్తున్న వారు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందోనని టెన్షన్ పడ్డారు. అయితే.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.