రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు

రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు

ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన జరిగింది. రైలు చక్రాల మధ్యనున్న స్థలంలో కూర్చుని ఓ బాలుడు వంద కిలోమీటర్లు ప్రయాణించాడు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది.  పట్టాల సమీపంలో ఆడుకుంటున్న బాలుడు అక్కడే ఆగి ఉన్న గూడ్స్  రైలు ఎక్కాడు. వెంటనే అది కదలడంతో దిగలేక బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయాడు. అలా కదిలిన రైలు ఏకంగా వంద కిలోమీటర్లు ప్రయాణించి యూపీలోని హర్దోయ్ స్టేషన్‌కు చేరుకుంది. 

రైలు కింద ఏదో కదులుతుందని అనుమానం వచ్చిన అధికారులు చెక్ చేశారు. చక్రాల మధ్య బాలుడిని గుర్తించారు. బాలుడిని తీసుకుని హర్దోయ్ ని చైల్డ్ కేర్ కు అప్పగించారు. అతని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడి కుటుంబం లక్నో-అలంనగర్ రాజాజీపూర్‌లోని బాలాజీ మందిర్‌లో నివసిస్తున్నట్టు విచారణలో తెలిసింది. బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చే చర్యలు చేపట్టారు ఆర్‌పీఎఫ్‌ పోలీసులు.