viral Video: ఓ మై గాడ్ .. రోడ్డు మధ్యలో ఇంత పెద్ద రంధ్రం కారు జస్ట్ మిస్

viral Video: ఓ మై గాడ్ .. రోడ్డు మధ్యలో ఇంత పెద్ద రంధ్రం కారు జస్ట్ మిస్

ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో నడి రోడ్డుపై పెద్ద రంధ్రం పడింది. అందులో ఓ కారు చిక్కుకుంది కూడా.. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. రోడ్డు మధ్యలో ఇంత భారీగా ఎలా కుంగిపోయిందని స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ఎగబడి చూస్తూ ఆశ్యర్యపోతున్నారు. ఓ కారు వెనుక టైర్లు ఆ లోయలో పడి అలా ఆగిపోయింది. జస్ట్ మిస్ కొద్దిగా ఉంటే కారు గుంతలో పడిపోయేది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వర్షకాలంలో కొండచర్యలు విరిగిపడుతూ.. వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. వాటికి తోడు లక్నో నగరంలో రోడ్లు కుంగిపోతున్నాయి. వికాస్ నగర్ లోని సెక్టార్-4లో రోడ్డు మధ్యలో పెద్ద గొయ్యి పడింది. ఐదారు అడుగుల లోతులో  గుంత పడి రోడ్డు మొత్తం కిందకి కుంగిపోయింది. భారీ వర్షాల కారణంగా ఇలా తరుచూ రోడ్లు ఇలా కుంగిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వీటిని బాగుచేయడంలో మున్సిపల్ కార్పొరేషన్  నిర్లక్ష్యం వహిస్తుందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.