పెబ్బేరు మండల బీఆర్ఎస్ అధ్యక్షుడిపై కేసు

పెబ్బేరు మండల బీఆర్ఎస్ అధ్యక్షుడిపై కేసు

వనపర్తి, వెలుగు: పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలోని చింతల హనుమాన్  దేవాలయం దగ్గర అమావాస్య సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో 2 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని, దీనిని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్  లీడర్ రాములుపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ రక్షితామూర్తి తెలిపారు.

పాతపల్లి, నాగసాన్పల్లి గ్రామాలకు చెందిన వారికి భోజనం పెట్టారని పేర్కొన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ఇలాంటివి ఓటర్లను ప్రభావితం చేయడం కిందకు వస్తాయన్నారు.