దారాన్ని గ్లాస్‌కి కట్టి షాండ్లియర్ తయారుచేయొచ్చు

దారాన్ని గ్లాస్‌కి కట్టి షాండ్లియర్ తయారుచేయొచ్చు
  • రెండు థర్మాకోల్‌ ప్లేట్స్‌ తీసుకోవాలి. ఒక ప్లేట్‌ని సగానికి కత్తిరించాలి. కత్తిరించిన  ప్లేట్‌ని ఇంకొక ప్లేట్‌పైన బోర్లించి, కలర్‌‌ పేపర్స్‌తో రెండింటిని అతికించాలి. తరువాత కలర్‌‌ పేపర్‌‌ని చిన్న బొమ్మలుగా కత్తిరించి ప్లేట్‌పైన అతికిస్తే పెన్సిల్‌ స్టాండ్‌ రెడీ.
  • థర్మాకోల్ గ్లాస్‌ తీసుకొని వాటిపైన కలర్‌‌ పెన్సిల్‌తో స్టార్స్‌ గీయాలి. పూసల్ని, బొమ్మల్ని  దారానికి కట్టాలి. గ్లాస్‌ అంచుకు చిన్న రంధ్రాలు చేసి దారాన్ని గ్లాస్‌కి కట్టి షాండ్లియర్ తయారుచేయొచ్చు.
  • అట్టముక్కల్ని గుండ్రంగా కత్తిరించి వాటికి కలర్‌‌ డ్రాయింగ్‌ పేపర్స్‌ అంటించాలి. వాటిపై మీకు నచ్చిన ఎమోజీలను గీసి గోడలకు పెట్టుకుంటే బాగుంటుంది.