లేబర్కోడ్లతో కార్మిక సంఘాల ఉనికికే ప్రమాదం : వాసిరెడ్డి సీతారామయ్య

లేబర్కోడ్లతో కార్మిక సంఘాల ఉనికికే ప్రమాదం : వాసిరెడ్డి సీతారామయ్య

కోల్​బెల్ట్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్​లను ప్రవేశపెట్టడం వల్ల కార్మిక సంఘాల ఉనికి లేకుండా పోతోందని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. మందమర్రి లోని ఏఐటీయూసీ ఆఫీస్​లో బుధవారం ఏర్పాటు మీడియా సమావేశంలో సింగరేణి జేఏసీ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, టీబీజీకేఎస్, ఐఎఫ్​టీయూ లీడర్లు సమ్మయ్య, నాగరాజు గోపాల్, సంపత్, రాముతో కలిసి సీతారామయ్య మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలను పెట్టుబడిదారులకు అప్పగించేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.

 సింగరేణిలో నూతన బొగ్గు గనుల తవ్వకాల కోసం వేలం నిర్వహించి సింగరేణికి దక్కకుండా, ప్రైవేట్ వ్యక్తులకే దక్కలా కేంద్రం వ్యవహరిస్తోందని, ఇది సింగరేణి సంస్థ మనుగడకే ప్రమాదమన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొని సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ లీడర్లు సలెంద్ర సత్యనారాయణ, దాగం మల్లేశ్, భీమనాథుని సుదర్శనం, శంకర్​రావు, సూర్యనారాయణ, రామగిరి రామస్వామి, ఐలయ్య, వీరారెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.