కాంగ్రెస్ అధ్యక్షుల సభకు తరలిరావాలి .. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు నేతల పిలుపు

కాంగ్రెస్ అధ్యక్షుల సభకు తరలిరావాలి .. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు నేతల పిలుపు

ఖానాపూర్/భైంసా/నేరడిగొండ/ఆదిలాబాద్​టౌన్/కోల్​బెల్ట్, వెలుగు: ఈ నెల 4న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనం, బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు తరలిరావాలని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాం గోపాల్ పటేల్ కోరారు. బుధవారం ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, భైంసాలోని కమల జిన్నింగ్​ఫ్యాక్టరీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  జైబాపు.. జై భీమ్.. జై సంవిధాన్​కార్యక్రమంలో భాగంగా సభ జరుగుతుందన్నారు. గ్రామ శాఖ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నేరుగా మండల అధ్యక్షులతో మాట్లాడతారని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో హాజరై సక్సెస్​చేయాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఆయా మండలాల కాంగ్రెస్ అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర నేతలు పాల్గొన్నారు.

సభను సక్సెస్ చేయండి

హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్​సభను పార్టీ కార్యకర్తలు, నాయకులు సక్సెస్ చేయాలని -టీపీసీసీ కార్యదర్శి బ‌ద్దం ఇంద్రకర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్​జిల్లా కేంద్రంలో, నేరడిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమాల్లో మాట్లాడారు. ఖ‌ర్గే సభను సక్సెస్​చేయాలని కోరారు. ఆదిలాబాద్, బోథ్​నియోజకవర్గాల ఇన్​చార్జీలు కంది శ్రీనివాస్​రెడ్డి, ఆడె గజేందర్, నేతలు పాల్గొన్నారు. మంచిర్యాల హైటెక్​సిటీ కాలనీలోని మంత్రి వివేక్​ వెంకటస్వామి నివాసంలో టీపీసీసీ జనరల్​సెక్రటరీ, మంచిర్యాల జిల్లా పరిశీలకులు రహమత్ హుస్సేన్ ఆధ్వర్యంలో చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ ​కార్యకర్తల మీటింగ్​నిర్వహించి మాట్లాడారు. గ్రామ శాఖ నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు నేరుగా సమావేశం కావడంలో దేశంలోనే మొదటిసారి అన్నారు. భను సక్సెస్​ చేయాలని కోరారు. పీసీసీ సభ్యులు రఘనాథ్ రెడ్డి, సుదర్శన్, ఆయా మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.