అంత్యక్రియలకు వెళ్లి.. పాముకాటుతో అనంతలోకాలకు చిన్నారి

అంత్యక్రియలకు వెళ్లి.. పాముకాటుతో అనంతలోకాలకు చిన్నారి

రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నలింగాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.   పాముకాటుతో నాలుగేళ్ల చిన్నారి స్నేహాన్షి మృతి చెందింది. కామారెడ్డి జిల్లాకు చెందిన  కృష్ణయ్య-లలిత దంపతులుకు ఇద్దరు కూతుళ్లు స్నేహాన్షి(4), శ్రీజ (2). చిన్న లింగాపూర్ లో   బంధువు  చనిపోవడంతో అంత్యక్రియలకు  పిల్లలతో  వెళ్లింది. 

మే 19న రాత్రి 9 గంటల ప్రాంతంలో పెద్ద కూతురు స్నేహాన్షి ఆడుకుంటూ ఇంటి బయటకు వెళ్లగా పాము కాటేసింది.  వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిన చిన్నారిని కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.  అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షించిన డాక్టర్లు మార్గ మధ్యలోనే పాప చనిపోయిందని చెప్పారు.  దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో కన్నీరుమున్నీరవుతున్నారు.