PCB central contracts: ఒక్కరికీ 'A' కేటగిరి లేదు: పాకిస్థాన్ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్.. 8 మంది ఔట్ 12 మంది ఇన్

PCB central contracts: ఒక్కరికీ 'A' కేటగిరి లేదు: పాకిస్థాన్ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్.. 8 మంది ఔట్ 12 మంది ఇన్

పాకిస్థాన్ మెన్స్ 2025-2026 సెంట్రల్ కాంట్రాక్టులను లిస్ట్ వచ్చేసింది. మంగళవారం (ఆగస్టు 19) 30 మంది సభ్యుల జాబితాతో కూడిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ పాకిస్థాన్ క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. ఈ కాంట్రాక్ట్ లిస్ట్ లో ఒక్కరు కూడా ఏ కేటగిరిలో లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మూడు విభాగాలలో 30 మంది ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ లో చోటు సంపాదించారు. గత సంవత్సరం 27 మంది ఉండగా.. ఈ ఏడాది మరో ముగ్గురిని అదనంగా చేర్చారు.  ఏ కేటగిరీలో ఉన్న బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ డెమోట్ అయ్యారు. మూడు ఫార్మాట్ లలో రెగ్యులర్ ప్లేయర్ కాకపోవడంతో ఈ స్టార్ క్రికెటర్లను బి కేటగిరిలో చేర్చారు. 

బి, సి, డి కేటగిరీలో మొత్తం 10 మంది ఆటగాళ్లు ఉన్నారు. 12 మంది కొత్త ఆటగాళ్లను జట్టులో చేర్చగా.. ఎనిమిది ఆటగాళ్లను కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి తొలగించారు. ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిది ఒక్కడే కేటగిరీ బి లో తన పేరును నిలుపుకున్నాడు. అబ్రార్ అహ్మద్, హరిస్ రవూఫ్, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాదాబ్ ఖాన్ లకు కేటగిరీ సి నుండి కేటగిరీ బి కి ప్రమోషన్ లభించింది. టెస్ట్ కెప్టెన్ షాన్ మసూద్ ను డి కేటగిరిలో చేర్చడం షాకింగ్ కు గురి చేస్తోంది.  ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కు ముందు షాన్ మసూద్ ను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించనున్నట్టు తెలుస్తోంది. 

12 మంది ఆటగాళ్లు అహ్మద్ డేనియల్, ఫహీమ్ అష్రఫ్ , హసన్ అలీ , హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మొహమ్మద్ అబ్బాస్, మొహమ్మద్ హరిస్, మొహమ్మద్ నవాజ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ మీర్జా, సుఫ్యాన్ మోకిమ్ కొత్తగా కాంట్రాక్ట్ లిస్ట్ లో చోటు సంపాదించారు. మరోవైపు గత సంవత్సరం 27 మంది జాబితా నుండి తొలగించబడిన ఎనిమిది మందిలో అమీర్ జమాల్, హసీబుల్లా, కమ్రాన్ గులాం, మీర్ హంజా, మొహమ్మద్ అలీ, మొహమ్మద్ హురైరా, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ ఉన్నారు.

2025-26 పాకిస్తాన్ మెన్స్ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్:

కేటగిరీ బి (10 ప్లేయర్లు): అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫఖర్ జమాన్ , హరీస్ రవూఫ్, హసన్ అలీ, మహ్మద్ రిజ్వాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాదాబ్ ఖాన్ మరియు షాహీన్ షా ఆఫ్రిది

ALSO READ : ఆస్ట్రేలియాపై విశ్వరూపం..

కేటగిరీ సి (10 ఆటగాళ్లు): అబ్దుల్లా షఫీక్, ఫహీమ్ అష్రఫ్, హసన్ నవాజ్, మహ్మద్ హరీస్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, నోమన్ అలీ, సాహిబ్జాదా ఫర్హాన్, సాజిద్ ఖాన్ మరియు సౌద్ షకీల్

కేటగిరీ డి (10 మంది ఆటగాళ్లు): అహ్మద్ డానియాల్, హుస్సేన్ తలత్, ఖుర్రం షాజాద్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, సల్మాన్ మీర్జా, షాన్ మసూద్ మరియు సుఫ్యాన్ మొకిమ్